ఒంగోలు మేయర్ అభ్యర్ధి నల్లమల్లి శ్రీశిల్ప ..

ప్రకటించిన తెలుగుదేశం అధిష్టానం
మూడో జాబితాలో స్థానం
ఒంగోలు మేయర్ అభ్యర్ధిగా నల్లమల్లి శ్రీశిల్పను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు
శనివారం రాత్రి విడుదల చేసిన జాబితాలోశ్రీ శిల్పకు స్థానం కల్పించారు. మేయర్ సీటును ఆశించిన అనేకమందిని పక్కనపెట్టిన తెలుగుదేశం అనూహ్యంగా నల్లమల్లి శ్రీశిల్పకు అవకాశం కల్పించింది. కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీ శిల్ప ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ప్రముఖ బంగారు నగల వ్యాపారి నల్లమల్లి బాలును వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల్లి బాలు అభ్యర్ధిత్వాన్ని కూడా పక్కనపెట్టి ఆయన సతీమణి శ్రీ శిల్పకు అవకాశం కల్పించారు. ఒక వైపు కాపులనూ, మరోవైపు వైశ్యులను సంతృప్తి పర్చే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
తెలుగుదేశం విడుదల చేసిన మూడో జాబితా

