పద్యాన్ని మానవీయం చేసిన మధురకవి

జానుడి ఆధ్వర్యంలో ప్రఖ్యాత కవి మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం..పాల్గొన్న విద్యార్ధులు
జానుడి ఆధ్వర్యంలో ఒంగోలులో మధురకవి మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలు

పద్యానికి మానవీయతను జోడించిన మధురకవి మల్లవరపు రాజేశ్వరరావు అని జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ అధ్యక్షుడు వై . విజయకుమార్ పేర్కొన్నారు. జానుడి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని జానుడి సాహిత్య కేంద్రంలో రాజేశ్వర రావు గారి వర్ధంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి న్యాయవాది ఆడే రామ సుబ్బారావు అధ్యక్షత వహించగా విజయకుమార్ రాజేశ్వర రావు గారి సాహిత్య కృషి గురించి వివరించారు. ఈ సందర్భంగా న్యాయవాది డాక్టర్ నూక తోటి రవికుమార్ మతసామరస్యం మీద రాజేశ్వరరావు గారు రచించిన పద్యాన్ని జానుడి ట్యూషన్ సెంటర్ విద్యార్థుల చేత ఆలాపింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని వై.దుర్గ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

మల్లవరపు రాజేశ్వరరావు సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న నూకతోటి రవికుమార్, వై.విజయకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *