అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • అమరావతి- ఆర్నబ్ తుపాను ప్రభావంపై రాత్రి 11 గంటల వరకూ ఉన్న పరిస్థితిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు
  • టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో అధికారులు, ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి
  • విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు ఉన్నట్టు తెలిపిన ఆయా జిల్లాల కలెక్టర్లు
  • కొన్ని చోట్ల తుపాను ప్రభావంతో చెట్లు పడిపోయాయని తెలిపిన అధికారులు,
    వాటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు సీఎంకు వివరించిన కలెక్టర్లు
  • ప్రస్తుతం ఆర్నబ్ తుపాను కాకినాడకు దగ్గర్లో తీరానికి అతి సమీపంగా వచ్చినట్టు సీఎంకు తెలిపిన అధికారులు
  • ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం
  • తుఫాను ప్రభావ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన
  • ఆర్నబ్ తుఫాను ప్రభావంపై అర్ధరాత్రి మరోమారు పరిస్థితిని తెలియచేయాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *