విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మృతి

అమెరికాలో చికిత్స పొందుతూ కన్నుమూత
సీఎం చంద్రబాబునాయుడు సంతాపం

balubramanyam one
న్యూజెర్సీ లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలసుబ్రమణ్యం

విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సఱ్ తో బాధపడుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (అక్టోబర్ 30,2006)న తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని మూడురోజుల్లో హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ మాజీ ఎండిగా ఇటీవలనే బాధ్యతలు తీసుకుని సెలవులో వెళ్ళారు. ఆగస్టు 30న పదవీ విరమణ చేశారు. పోలీస్ అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ప్రకాశం జిల్లా ఎస్పీగా, రవాణాశాఖ కమిషనర్ గా పనిచేశారు.

సీఎం చంద్రబాబు సంతాపం

సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రగా
ఢ సంతాపం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిబద్దతకూ, నిజాయితీకి ఆయన మారుపేరని కొనియాడారు. పోలీస్ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బాలసుబ్రమణ్యం కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *