ఒంగోలు మేయర్ అభ్యర్ధికి రిటైర్డ్ ఏఎస్పీ జగన్ మద్దతు

  • కాపుల ఆడబిడ్డను గెలిపించండి 
  • ఒంగోలు వెళ్ళి విస్తృత ప్రచారం చేసిన జగన్ 

జనసేన నాయకుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి (జగన్) ఒంగోలు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నల్లమల్లి శ్రీశిల్పకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరులో నివాసముంటున్న ఆయన ఒంగోలు వెళ్ళి శ్రీశిల్పకు కాపుల మద్దతు కూడగట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీశిల్ప ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన నల్లమల్లి బాలును వివాహం చేసుకున్నారు. దీంతో ఆమె సామాజికవర్గంపై కాపులందరికీ పూర్తిస్థాయి అవగాహన లేదు. ఈ నేపథ్యంలో నల్లమల్లి శ్రీశిల్పకు కాపుల మద్దతు కూడగట్టేందుకు జగన్ ఒంగోలులో తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. ఒంగోలులో ఎస్ ఐ స్థాయి కేడర్ నుంచి ఏ ఎస్పీగా రిటైర్ అయ్యే వరకు వివిధ హోదాల్లో ఆయన విధులు నిర్వహించారు. రౌడీలు, గూండాల గుండెల్లో గుబులు పుట్టించిన పోలీస్ అధికారిగా ఆయనకు మంచి పేరుంది. కేవలం కాపు సామాజికవర్గంలోనే కాకుండా నగరంలోని అనేకమంది ప్రముఖులతో ఆయనకున్స సత్సంబంధాలున్నాయి. రిటైర్ అయిన తరువాత జనసేనలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన పార్టీకి ఎక్కడ అవసరమున్నా అక్కడికి వెళుతూ జనసేనను బలోపేతం చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా కాపు సామాజికవర్గానికి చెందిన ఒంగోలు మేయర్ అభ్యర్ధి నల్లమల్లి శ్రీశిల్పలకు మద్దదుగా నిలిచి ప్రచారం చేస్తున్నారు.

jagan kapu two
మీడిాయ సమావేశంలో మాట్లాడుతున్న జగన్, కోలా ప్రభాకర్, నల్లమల్లి శ్రీ శిల్ప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *