వందల కోట్లు కొల్లగొట్టిన బాలినేని
తీవ్ర ఆరోపణలు చేసిన కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి
ప్రకాశం జిల్లాలో ‘బి’ ట్యాక్స్ వసూలు
విద్యుత్ సంస్థల నుంచీ, గ్రానైట్ కంపెనీల నుంచి వసూలు
ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడ్డ బాలినేని
కొల్లగొట్టిన మొత్తం సొమ్ము రూ 1734 కోట్లు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ‘బి’ ట్యాక్స్ పేరుతో వేల కోట్లు సంపాదించాడని కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్టర్ వ్యాప్తంగా ‘జె’ ట్యాక్స్ అమల్లో ఉంటే ప్రకాశం జిల్లాలో మాత్రం బి ట్యాక్స్ అమల్లో ఉందన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని గడిచిన మూడేళ్లలో రూ 1734 కోట్లను అక్రమంగా సంపాదించాడన్నారు.
- విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం వెనుక బాలినేని హస్తం ఉంది. విద్యుత్ సంస్థల నుంచి రూ 495 కోట్లు కాజేశారు..
- గ్రానైట్ కంపెనీల నుంచి సుమారు రూ. 9,500 కోట్ల బీ-ట్యాక్స్ రూపంలో బాలినేని వసూలు చేశారు. గ్రానైట్ డంపింగ్ యార్డు నుంచి రూ.300 కోట్లు, గ్రానైట్ వ్యాపారుల నుంచి బీ-ట్యాక్స్ రూపంలో రూ.50 వేల నుంచి లక్షరూపాయల వరకు తన అనుచరుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారు. మైనింగ్ డిపార్టుమెంట్ నుంచి రూ.905 కోట్లు కాజేశారు.
- పర్చూరు, చీరాల ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి ప్రాంతాల్లో ఇసుకను కూడా వదలటం లేదు. తన అనుచరులు, బినామీలతో కూడిన ఇసుక మాఫియా నుంచి సుమారు 100 కోట్లు వసూలు చేశారు.
- కొండేపి నియోజకవర్గంలోని కొణజేడు, ఎర్రజెర్ల ప్రాంతాల నుంచి సుమారు 40 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన గ్రావెల్ ను అమ్ముకున్నారు. భూకబ్జాలతో దాదాపు 187 కోట్ల రూపాయల్ని బాలినేని వెనకేసుకున్నాడు. ఒంగోలులోని రంగుల ఫ్యాక్టరీ దగ్గర 4 ఎకరాలు, మంగమూరు డొంకలో 6 ఎకరాలు, ఉడ్ కాంప్లెక్స్ దగ్గర 3 ఎకరాలతోపాటు డీ.కే. పట్టాలద్వారా వందలకోట్ల విలువైన భూమిని బాలినేని ఆక్రమించుకున్నాడని డోలా ధ్వజమెత్తారు. తనమంత్రి పదవి పోతుందని తెలిసి జిల్లాలో ఉన్న మరో దళిత మంత్రిని కూడా పదవినుంచి తీసేయాలని పట్టుబట్టే నీచస్థితికి బాలినేని దిగజారాడని స్వామి అన్నారు.