భానుడు భగ భగ..పెరుగుతున్న ఎండ తీవ్రత
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం (24-04-26) రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఎల్లుండి 07 తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(62)
శ్రీకాకుళం జిల్లా: ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, మందస, నందిగాం, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు;
విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, శృంగవరపుకోట, తెర్లాం, వంగర, వేపాడ, విజయనగరం రూరల్ మండలాలు;
పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు;
అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం;
పోలవరం జిల్లా: గంగవరం, రంపచోడవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాలు ;
అనకాపల్లి జిల్లా : బుచ్చయ్యపేట, దేవరపల్లి, కె.కోటపాడు, రావికమతం మండలాలు ;
కాకినాడ జిల్లా : గండేపల్లి, జగ్గంపేట మండలాలు ;
తూర్పుగోదావరి : గోకవరం, కోరుకొండ మండలాలు ;
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో మండలాల్లో(62) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

గురువారం శ్రీకాకుళం(జి) కొత్తూరులో 45.4°C, కడపలో 45.1°C, మన్యం(జి) సాలూరులో 45.1°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.9°C, విజయనగరం(జి) రాజాంలో 44.5°C, కాకినాడ(జి) కరపలో 44.4°C, మార్కాపురం(జి) కంభంలో 44°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, కృష్ణా(జి) పెద్దపారుపూడి, నెల్లూరు(జి) సైదాపురంలో 43.5°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 43.3°C, కర్నూలు(జి) నగరడోనలో 43.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె, ఏలూరు(జి) కుక్కునూరు, పల్నాడు(జి) వెల్దుర్తిలో 43.1°C, పోలవరం(జి) కూనవరం, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

