ap news

దళితులను చెప్పుతో కొట్టారు

పోకూరి రమాదేవి, వాసులను అరెస్ట్ చేయాలి
అరెస్ట్ చేయవద్దంటూ డీఎస్పీపై వత్తిడి
ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి ధర్నా

మేదరమెట్లలో దళిత మహిళలను చెప్పుతో కొట్టిన కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ నిందితులైన పోకూరి రమాదేవి, వాసులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషణ్ ముందు దళిత హక్కుల పరిరక్షణ సమితి ధర్నా నిర్వహించింది. వారిని అరెస్ట్ చేయవద్దంటూ అధికారపార్టీ రెడ్డి నాయకులు డిఎస్పీపై వత్తిడి తీసుకువస్తున్నారని సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం ఆరోపిపించారు. దళిత మహిళలను చెప్పుతో కొట్టినట్టు 29 మంది సాటి కూలీలు సాక్ష్యం చెప్పినా వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం చట్టవిరుద్దం..ఎవరి వత్తిళ్లకు లొంగి వారిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఒంగోలు దళిత మేయర్ ను అవమానించారన్న కేసులో సుబ్బరాయగుప్తాను జైలుకు పంపించిన పోలీసు అధికారులు అగ్రకుల నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నాగేంద్రం ప్రశ్నించారు.

నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో
ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న దళిత హక్కలు పరిరక్షణ సమితి కార్యకర్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp