మత్స్యకారుల ప్రాణరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
మత్స్యకారుల ప్రాణరక్షణ, వారి కుటుంబాల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, తుఫాను హెచ్చరికలు, భద్రతా నిబంధనలను (SOP) ప్రతి మత్స్యకారుడు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇప్పటికే 80 శాతం బోట్లకు ట్రాన్స్‌పాండర్లు అమర్చామని, మిగిలిన వాటికి కూడా త్వరితగతిన ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బోట్ల ఫిట్‌నెస్, రక్షణ పరికరాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్‌ను ఆదేశించారు.
అర్హులైన ప్రతి మత్స్యకారుడికి, మత్స్య అనుబంధ కార్మికులకు ప్రభుత్వ, ఎన్‌ఎఫ్‌డీబీ (NFDB) బీమా రక్షణ అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులు బీమా కోల్పోయినా, లేదా రక్షణ లోపాలతో ప్రాణనష్టం జరిగినా బాధ్యులపై కఠిన చర్యలతో పాటు నష్టపరిహారాన్ని వారి నుంచే రికవరీ చేస్తామని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే మత్స్యకారులు వెంటనే FDO, ఇన్‌స్పెక్టర్ లేదా VFAలను సంప్రదించాలని, సిబ్బంది స్పందించకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన భరోసా ఇచ్చారు.
Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *