పంటల బీమా అమలుకు కొత్త బాట

జాతీయ సంస్థలతో మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ
క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్న మాస్టర్ ట్రైనర్లు

అమరావతి, ఆంద్రావని న్యూస్ :  రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అమలును మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ స్థాయి సంస్థల సహకారంతో మాస్టర్ ట్రైనర్లకు రెండు రోజుల సాంకేతిక శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపికైన 56 మంది మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. రాయలసీమలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు, కోస్తా జిల్లాల్లో వరుస తుపానుల కారణంగా పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో రైతులకు పంటల బీమాపై అవగాహన పెంచడం అత్యంత అవసరమని శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. పంటల బీమా సమర్థ అమలుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సమగ్ర అవగాహన, వివిధ సంస్థల మధ్య సమన్వయం కీలకమని ఆయన తెలిపారు.

కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతినిధి పల్లవి మాలి

మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ

వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా జిల్లాల్లోని ఇతర అధికారులకు కూడా శిక్షణ అందించేలా క్రమానుగత శిక్షణ విధానాన్ని అమలు చేస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ (NIA) ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సంచాలకులు డాక్టర్ కె. శ్రీనివాసులు, ఆర్థిక గణాంక శాఖ సంచాలకులు బి. గోపాల్, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతినిధి పల్లవి మాలి, ఎన్ఐఏ అసోసియేట్ ప్రొఫెసర్ అర్చనా సింగ్ తదితరులు పాల్గొని పంటల బీమా విధానాలు, పంట కోత ప్రయోగాలు, YES-TECH సాంకేతికత, దిగుబడి అంచనాలు, కార్యాచరణ మార్గదర్శకాలపై శిక్షణ అందిస్తున్నారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్
మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్
Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdeshgunturu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *