పవన్ కళ్యాణ్ తో లోకేష్ భేటీ

విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న సిఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్ కు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్ల వివరాలను మంత్రి లోకేష్ డిప్యూటీ సిఎంకు తెలియజేశారు. పెట్టుబడుల రాకకు చొరవ చూపుతున్న మంత్రి లోకేష్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

లోకేష్, పవన్ ల ఆత్మీయ ఆలింగనం
Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *