ప్రకాశంలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు
  • 2,391 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు 
  • రౌడీషీటర్ల బైండోవర్ 
  • అవాంఛనీయ సంఘటనలు జరిగితే
  • 100 లేదా 112 కు ఫోన్లే వాట్పాప్ నంబరు   9121102266కు ఫోన్ చేయండి 
  • ప్రకాశం జిల్లా ఎస్పీ వి.వి. హర్షవర్ధన్ రాజు 

ఈనెల 5 నుంచి నిర్వహించనున్న జడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ వి.వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. 2,391 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా  కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. డిస్ట్రిబ్యూషను సెంటరు నుండి పోలింగు మెటీరియల్ తీసుకొని వెళ్ళే దగ్గర నుండి పోలింగు ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా స్ట్రాంగ్ రూంలకు తరలించే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద పక్కా ప్రణాళికతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

జిల్లాలో 25 జడ్పీటీసీ, 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు మొత్తం 714 పోలింగ్ ప్రాంతాల్లో 1,260 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 83 అత్యంత సమస్యాత్మక, 149 సమస్యాత్మక, 482 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రౌడీ షీటర్ల బైండోవర్

ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో రౌడీషీటర్లతో పాటు అల్లర్లు చేయవచ్చనే అనుమానం ఉన్న వ 974 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు.  ఎన్నికల నియమాలను ఉల్లంఘించి 23 కేసులు,అక్రమ మద్యం స్వాధీనానికి సంబంధించి 48 కేసుల్లో 187.37 లీటర్ల మద్యం, రూ.2,80,300 నగదును 13 కేసుల్లో స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్స్ తో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పటు చేసి తగిన భద్రతను కూడా ఏర్పాటు చేయడమైంది.

పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే  వెంటనే డయల్  100 లేదా 112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *