చంద్రబాబు వరుస టెలికాన్ఫరెన్స్ లు
- తుపానుల తీవ్రతపై నిరంతరం సమావేశాలు
- ప్రతి క్షణం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
- నష్టాన్ని తగ్గించటంలో సఫలీకృతం
- యుద్ధ ప్రాతిపదికపై సహాయచర్యల పర్యవేక్షణ
మురసు తుఫాను ప్రభావంపై 12 జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు టెలికాన్ఫరెన్స్
45 వేలమందికి పైగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి
గడచిన వారం రోజులుగా అర్నబ్ తుఫాను, మురసు తుఫాన్లలో నిరంతరాయంగా శ్రమిస్తోన్న అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి• ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం పనిచేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం
• ప్రజల భాగస్వామ్యంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన సీఎం
• రేపటి వరకూ మురసు తుఫాను వల్ల వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి

• గడచిన 24 గంటల్లో బాపట్లలో 20 సెంటిమీటర్లు, నాగులుప్పలపాడు 20, కొత్తపట్నం 18, త్రోవగుంట 17, చీరాల, 17, నర్సాపురం 16, సెంటిమీటర్ల మేర వర్షం కురిసిందని వెల్లడి
• ఇవాళ ఉదయం నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడులో 25 సెంటిమీటర్లు, మద్దిపాడు 24, చిలకలూరిపేట 22, నాదెండ్ల 22, గన్నవరం 21, చిగురుమామిళ్లలో 21 సెంటిమీటర్ల మేర వర్షం కురిసిందని వెల్లడి
• బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసిందని..రేపు ఉదయం వరకూ అన్ని జిల్లాల్లోనూ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
• రేపు సాయంత్రంలోగా బాధితులకు ఇవ్వాల్సిన సాయం కూడా అందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించిన సీఎం
• ప్రస్తుతం కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ వివిధ జిల్లాల్లో తుఫాను మురసు వర్ష ప్రభావంపై జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
• వర్షప్రభావంతో పాటు ముంపు ప్రాంతాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించిన సీఎం
• గుంటూరు, పల్నాడు సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల వరద ప్రవాహాలు దిగువన బాపట్ల జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి
• పలనాడులోని ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల తదితర ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ తరహాలో వర్షం కురిసిందని సీఎంకు తెలిపిన ఆ జిల్లా కలెక్టర్
• పర్చురు వాగు నుంచి ప్రవాహాలు సముద్రంలోకి వస్తున్నట్టు తెలిపిన బాపట్ల జిల్లా కలెక్టర్
• వర్షాలు తగ్గేంత వరకూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా జిల్లా కలెక్టర్లు ఉండాలి
• ప్రస్తుతం పడుతున్న వర్షాల కారణంగా వరద ప్రవాహాలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
• గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

