ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి

  • ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలి
  • ఒక వైపు తీవ్ర కరవు..మరో వైపు వరుస తుపాన్ ల దెబ్బ
  • ప్రభుత్వం తక్షణం స్పందించాలి
  • రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి

ఒక వైపు ఎల్ నినో ప్రభావంతో ఏర్పడ్డ తీవ్ర కరువు..మరో వైపు వరుస తుపానులతో ఏర్పడ్డ ప్రకృతి విపత్తుల ద్వారా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందనీ, రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ సభ్యుడు ఎం.వి.ఎస్ నాగిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణం వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని వ్యవసాయ రంగానికి మరోసారి తీవ్ర ముప్పు ఏర్పడింది..ఇప్పటికే వరుస కరువులతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి, తాజాగా తుఫాన్ రూపంలో మరో విపత్తు ఎదురయింది. 2026 నవంబర్ 2వ తేదీకి సంబంధించి భారత వాతావరణశాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 18 జిల్లాల్లో అయిదు రెడ్, ఏడు ఆరంజ్, ఆరు ఎల్లో జోన్లలో ఉన్నాయి. వరుస కరువులు, తుపాన్ వంటి ప్రకృతి విపత్తులతో గడిచిన యాభై ఏళ్ళలో ఎన్నడూ లేనంత తీవ్ర దుర్భరస్థితిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటోంది.. రైతాంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు 55.6 శాతం లోటు వర్షపాతం నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం 415 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.ఈ కరువు ప్రభావంతో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, సజ్జ, మినుము, పెసర, కంది తదితర ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో పండ్ల తోటలు, ముఖ్యంగా చీనీ తోటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అనంతపురం నుంచి పల్నాడు వరకు రైతాంగం తీవ్ర వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నాగిరెడ్డి అన్నారు.

arnab vari
తుపాను ధాటికి నేలకొరిగిన వరి చేలు

అర్నబ్ తుఫాన్‌తో ఇప్పటికే భారీ నష్టం

ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో వరి, కొబ్బరి, అరటి పంటలతో పాటు ఆక్వా రంగం లక్షలాది ఎకరాలలో తీవ్రంగా దెబ్బతిందని నాగిరెడ్డి వివరించారు. ఆ నష్టాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు ఇప్పుడు మురసు తుఫాన్ మరో పెద్ద సవాలుగా మారిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్,ఎంవీఎస్ నాగిరెడ్డి,అగ్రికల్చర్ ఎమర్జెన్సీ,మురసు తుపాన్,వర్షపాతం లోటు,వరి పంటకు తీవ్ర నష్టం,నీటిపాలైన పంటలు
ఎంవీఎస్ నాగిరెడ్డి మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్

పంట నష్టాలకు ప్రధాన కారణాలు

వరి: కోత దశలో ఉన్న పంటలు, పొలాల్లో నీరు నిలవడం వల్ల తీవ్ర నష్టం.
మిర్చి: అధిక వర్షాలు, నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలకు నష్టం, తెగుళ్ల ముప్పు.
పత్తి: పూత, కాయ దశలో ఉన్న పంటలకు వర్షాలు, గాలుల వల్ల నష్టం.
కంది: పంట ఎదుగుదల, కాయ దశలో ప్రతికూల ప్రభావం.
అరటి: ఈదురు గాలులకు నేలపై పడి పోయి తీవ్ర నష్టం.
ఆక్వా: భారీ వర్షాలు, వరదనీరు,, ఉద్యుత్ సరఫరా లోపం వల్ల సాగుదారులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం

ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి!

ఇప్పటికే కరువుతో పంటలు కోల్పోయిన రైతులకు, అర్నబ్ తుఫాన్ నష్టాలు తోడయ్యాయి..ఇప్పుడు మురసు తుఫాన్ ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నది సాధారణ ప్రకృతి వైపరీత్యం కాదు. వరుస కరువులు, తుఫాన్లతో రైతాంగం ఉనికికే ముప్పు ఏర్పడుతోంది..రైతులను ఆదుకోవడం దయగా కాకుండా బాధ్యతగా ప్రభుత్వం భావించాలన్నారు. కాదు ప్రభుత్వ బాధ్యత.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక వ్యవసాయ సహాయ ప్యాకేజీ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *