పోలింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల కమిషనర్

విజయవాడలో పోలింగ్ సరళి పరిశీలన 

విజయవాడ  ఇబ్రహీంపట్నంలోని DAV Public School పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.

ఇబ్రహీంపట్నంలోని DAV Public Schoolలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇప్పటివరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.

punetha visiting one
పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న అనిల్ చంద్ర పునేఠా

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ…

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించానని, అన్ని చోట్లా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

punetha visiting two
పోలింగ్ సిబ్బందికి సూచనలిస్తున్న ఎన్నికల కమిషనర్ పునేఠా

ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు. వీటి ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *