మ‌న‌మిత్ర‌…ఇది జ‌న‌మిత్ర‌

  • తుపాన్  బాధితుల‌కు భ‌రోసాగా మ‌న‌మిత్ర‌
  • వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను వినియోగించుకున్న బాధితులు
  • 1500ల‌కుపైగా స‌మ‌స్య‌ల‌ను షేర్
  • వెంటనే ప‌రిష్క‌రించిన యంత్రాంగం
  • ప్ర‌త్యేక దృష్టి సారించిన ఆర్టీజీఎస్‌
  • కోన‌సీమ‌, కాకినాడ‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌, శ్రీకాకుళం నుంచి అత్య‌ధిక స‌మ‌స్య‌లు
manamitra one
అర్న‌బ్ తుపాన్ వేళ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ బాధితుల‌కు కొండంత భ‌రోసాగా నిలిచి సేవ‌లందించింది. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితులు త‌మ ప్రాంతంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చే స‌దుపాయం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌లు అధికారుల‌ను ఆదేశించారు. దీనిపై స్పందించిన రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు మ‌న‌మిత్ర ద్వారా తుపాన్ బాధిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చే స‌దుపాయాన్ని వెంట‌నే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు దానిపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు విప‌త్తు వేళ మ‌న‌మిత్ర సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకుని ఉప‌శ‌మ‌నం పొందారు. త‌మ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయ‌ని, చెట్లు కూలాయని, కరెంటు పున‌రుద్ద‌రించాల‌ని, ఆహారం అందజేయాల‌ని, మెడిసిన్స్ కావాల‌ని, ఇత‌ర‌త్రా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చి అత్య‌వ‌స‌ర సాయం పొందారు.

95 శాతానికిపైగా ప‌రిష్కారం

మ‌న‌మిత్ర ద్వారా తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు శుక్ర‌వారం సాయంత్రానికి 1500ల‌కుపైగా స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మ‌న‌మిత్ర ద్వారా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను 95 శాతంపైగా అధికారులు యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించారు. మ‌న‌మిత్ర ద్వారా తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు షేర్ చేసిన ప్ర‌తి స‌మ‌స్య‌ను ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్య నేరుగా ఆయా ప్రాంతాల్లోని స్వ‌ర్ణ గ్రామ స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల‌కు చేర‌వేసి, ఆ స‌మ‌స్య ప‌రిష్కారం చేయాల్సిన అధికారుల‌కు వెంట‌నే దాన్ని పంపి, వ‌చ్చిన స‌మ‌స్య వెంట‌నే ప‌రిష్క‌రించేలా ప‌ర్య‌వేక్షించారు.

గోదావ‌రి జిల్లాల నుంచే ఎక్కువ‌

అర్న‌బ్ తుపాన్ తీవ్రత ఎక్కువ‌గా ఉన్న గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జ‌లు తుపాన్ వేళ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ పెద్ద ఎత్తున ఉప‌యోగించుకున్నారు. కోనసీమ‌, కాకినాడ‌, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల నుంచి అత్య‌ధికంగా ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాల్ల తుపాన్ కార‌ణంగా ఎదురైన స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఉత్త‌రాంధ్ర జిల్లా నుంచి కూడా ఎక్కువ‌గానే స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. విశాఖ‌ప‌ట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వంద‌ల సంఖ్య‌లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు షేర్ చేసుకున్నారు.

వాట్సాప్ డీపీ స్టేట‌స్‌గానూ మ‌న‌మిత్ర‌

అర్న‌బ్ తుపాన్ స‌మ‌యంలో ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రును త‌మ వాట్సాప్ డీపీ స్టేట‌స్ గా కూడా ప్ర‌ద‌ర్శించారు. ప‌లు వాట్సాప్ గ్రూపులు సైతం త‌మ డీపీ స్టేట‌స్‌గా మ‌న‌మిత్ర‌ను పెట్టారు. ఫ‌లితంగా విప‌త్తుల వేళ మ‌న‌మిత్ర బాధితులంద‌రికి చేర‌గ‌లిగింది. త‌ద్వ‌రా మ‌న‌మిత్ర 9552300009 నెంబ‌ర్‌ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల హౌస్‌హోల్డు నేమ్‌గా మారింది. తుపాన్ విప‌త్తుల వేళ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ బాధితుల ప‌క్షాన కీల‌కంగా ప‌నిచేయడం ప‌ట్ల ప్ర‌భుత్వ వ‌ర్గాలు సంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి

కాల్ సెంట‌ర్ల‌కు స్పంద‌న‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు కూడా అర్న‌బ్ తుపాన్ తీవ్ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌క‌రించాయి. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబ‌ర్లు 112 , 1070, 1800 425 0101 కు తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఫోన్లు చేసి అత్య‌వ‌స స‌హాయం కోరారు. ఆ స‌మ‌స్య‌ల‌ను కూడా అధికారులు త‌క్ష‌ణం ప‌రిష్క‌రించారు. ఈ నెంబ‌ర్లకు 741 కాల్స్ వ‌చ్చాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *