జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికం

- దాడుల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- డెమెక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్లా ఎన్నికల బూత్ లు వద్ద సంఘటనలను చిత్రికరిస్తున్న జర్నలిస్ట్సులపైన పోలీసులు దాడులు చేయటం అప్రజాస్వామికమని డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియర్ (డీజెయు) రాష్ట్ర నాయకులు బళ్ల రాధాకృష్ణా, మరీదు ప్రసాద్ బాబు, శంకర్, ప్రసాద్ రావు తదితరులు ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది నేతిబీరకాయలో నెయ్యి చందంగా మారిందన్నారు. ‘ఈ రోజు ఒక మీడియా .. రేపు మరో మీడియా.. అందరూ పాత్రికేయులనన్న సంగతి మర్చిపోకూడదన్నారు. జర్నలిస్ట్ లతో పాటు జర్నలిస్ట్ కుటుంబసభ్యులపై దాడుల గురించి ప్రభుత్వం వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మా జర్నలిస్ట్ లపై దాడులు చేసిన వారినీ, అరాచక శక్తుల వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ లపై దాడులు చేస్తున్న, చేసే వాళ్ళకి అంటకాగుతున్న వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
