ముంచుకొస్తున్న మురసు తుపాను..
ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం
ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుపాను గా మారింది. మురసు గా పిలిుస్తున్న ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకి 200 కిమీ, నెల్లూరుకు 210 కిమీ, మచిలీపట్నానికి 270 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కావలికు 220 కిమీ, ఒంగోలుకు 260 కిమీ దూరంలో ఉన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 2) అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిమీ వరకు గరిష్టంగా 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు
- సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు..ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు
- ఏలూరు, తూగో, పగో, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు
అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం - సహాయక చర్యలు కోసం ముందస్తుగా ఆర్ ఎన్ డిఆర్ ఎఫ్, 7 ఎస్ డిఆర్ ఎఫ్ బృందాలు


