ఈనెల 5న జడ్ పిటీసీ, ఎంపీటీసి ఎన్నికలు

  • వర్షాలు తగ్గటంతో యథాతధంగా పోలింగ్
  • స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ ఛంద్ర పునేఠా
  • జిల్లా కలెక్టర్, ఎస్పీలు, డీజీపీలత వీడియో కాన్ఫరెన్స్

జడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ముందుగా ప్రకటించినట్టు ఈనెల 5 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తుపాను ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టటంతో ఎన్నికల నిర్వహిణకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం లేదని భావించింది.

ఈ మేరకు రాష్ట్రంలోని కురుస్తున్న భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ ల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై బుధవారం సమగ్రంగా సమగ్రంగా సమీక్షించారు. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయనీ, పరిమిత సంఖ్యలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్లు వెల్లడించారు.ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని పునేఠా తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో సుమారు 2,52,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బంది కొరత తలెత్తకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం సుమారు 52,000 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీని కేవలం బయటకే పరిమితం చేయకుండా, పరిస్థితులను బట్టి లోపల కూడా కూడా అనుమతించాలని సూచించారు. ఓటు రహస్యానికి ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ దృశ్యాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆదేశించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ప్రతి ప్రిసైడింగ్ అధికారికి సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా మార్గదర్శకాలు అందించాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేని ప్రిసైడింగ్ అధికారులకు ఇతర పీవోలు లేదా పోలీసు అధికారుల ఫోన్ల ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ…
మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషనర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అదే తరహాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి మైక్రో లెవెల్ ప్లానింగ్ రూపొందించామని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సెక్టార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ మాట్లాడుతూ…

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.

 

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *