జనసేన కార్పొరేటర్లకు కంది రవిశంకర్ అభినందనలు
ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధులను ఆ పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ అభినందించారు. కార్పొరేటర్ గా గెలిచిన వారిని శాలువాతో సత్కరించారు. కార్పొరేటర్ పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.

