ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి

కుప్పం నుంచి ఇచ్చా పురం వరకు

2007 మే 9 నుంచి ప్రజా యాత్ర

బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా, పార్టీ నియామకాల తరహాలో అధికార పార్టీకి అనుకూలంగా మార్చేసిందని బారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

  • బీసీ రిజర్వేషన్ల హామీ: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర: ప్రజా సమస్యలు, బలహీన వర్గాల హక్కుల కోసం 2027 మే 9 నుంచి కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ప్రజా యాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి: ప్రధాన పార్టీల విధానాలకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ ప్రత్యామ్నాయ వేదికగా పోరాడుతుందని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై వ్యాఖ్యలు: నవంబర్ 11న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించిన కొత్త పార్టీ రాష్ట్ర సంక్షేమం కోసం కాకుండా, కేవలం గత పార్టీలో గౌరవం దక్కలేదనే వ్యక్తిగత ఎజెండాతో ఏర్పాటైందని రామచంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.

Share this:
andhraprdeshgunturu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *