సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

ఎంఓయూలు కుదుర్చుకున్న రిలయన్స్, గెయిల్ 

విశాఖపట్టణం, ఆంధ్రావని న్యూస్ : 

సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు కియా, రిలయన్స్, గెయిల్ సహా వివిధ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు మొత్తం 88 పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పిడి జరిగింది. 73 అవగాహన ఒప్పందాలు, 15 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలి రోజున పెట్టుబడి ప్రతిపాదనలు చేసిన సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రీన్‌కో ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, కియా ఇండియా ఉన్నాయి. శ్రీకాకుళంలో రష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీస్, కడపలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నాయి. పునరుద్పాదక ఇంధన రంగంలో గ్రీన్‌కో సంస్థ , క్లీన్ మ్యాక్స్ , కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ ఎంఓయూలు చేసుకున్నాయి. ఆటోమొబైల్, వాహన విడిభాగాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కియా, తిరుపతి జిల్లాలో హీరో మోటోకార్ప్, ప్రకాశం జిల్లాలో ఎంఎన్‌ఎల్ సొల్యూషన్స్ పెట్టుబడులు పెట్టనున్నాయి. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో శ్రీకాకుళంలో గెయిల్ ఇండియా, నెల్లూరులో ఎన్‌ఏఎన్ మ్యాగ్నెటెక్ ,తిరుపతిలో ఎన్‌ఏఎన్ సిలోక్స్ గ్రీన్‌మెట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నాయుడు పేటలో ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, అనంతపురంలో శ్రీ వసుధ ఫుడ్స్ ఎంఓయూలు చేసుకున్నాయి. ఏరోస్పేస్, రక్షణ రంగంలో సత్యసాయి జిల్లాలో ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ , నెల్లూరులో వజ్రశక్తి వెంచర్స్, క్షిపణులు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, డ్రోన్ల తయారీకి ఆదిత్య ప్రెసిటెక్ పెట్టుబడి ప్రతిపాదనలు చేశాయి.

Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *