అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏడుగురికి గాయాలు

రాయలచెరువు సమీపంలో ఎన్‌హెచ్‌–67పై ఘటన

అనంతపురం | ఆంధ్రావని న్యూస్ | నవంబరు 27

అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. యాడికి మండలం రాయలచెరువు సమీపంలో జాతీయ రహదారి–67పై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ప్రయాణికులతో వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్‌లో వివాహ వేడుకకు హాజరై స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఢీకొన్న తీవ్రతకు వాహనం ముందు భాగం దెబ్బతింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహన చోదకుడు అదుపు కోల్పోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రవాణా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.

Share this:
andhraprdesh