రాజమహేంద్రవరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

జిల్లా కోర్టు 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

అమరావతి, నవంబర్ 27: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (నవంబర్ 28) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవం, బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

ఉదయం 10.30 గంటలకు వేడుకలు

ముఖ్యమంత్రి ఉదయం 9.30 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.05 గంటల వరకు నిర్వహించే జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకలు, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం అమరావతికి తిరుగు ప్రయాణం

రాజమహేంద్రవరంలో కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు ముఖ్యమంత్రి అమరావతిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *