తెలంగాణలో 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం లక్ష్యం

హైదరాబాద్, నవంబరు 27: తెలంగాణలో 2029 నాటికి డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో గురువారం డేటా సెంటర్ నిర్వాహకులు, గ్రీన్ ఎనర్జీ రంగ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ లక్ష్యాన్ని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 300 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం అందుబాటులో ఉందని, మరో 2 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్ల ప్రాధాన్యం పెరుగుతోందని, వాటికి నిరంతర విద్యుత్ సరఫరా, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఐటీ, పరిశ్రమలు, ఇంధన శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో పాల్గొనాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *