Medical and Health

బసవతారకంలో 14 పడకల ఎమర్జన్సీ వార్డు

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్  – రీసెర్చి ఇన్ స్టిట్యూట్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 పడకల ఎమెర్జెన్సీ వార్డును ప్రారంభించిన సంస్థ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ

తెలుగు ప్రజలకూ,  అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 పడకల ఎమెర్జెన్సీ వార్డు ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. హాస్పిటల్ కు అత్యవసర పరిస్థితులలో వచ్చే పేషెంట్లకు ఈ నూతన వార్డు ఎఁతగానో ఉపయోగపడనుంది. గతంలో 7 పడకలతో ఉన్న ఎమెర్జెన్సీ వార్డు స్థానంలో ఈ నూతన వార్డు ఏర్పాటైంది.

ఎమెర్జెన్సీ వార్డును ప్రారంభించిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వార్డును అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది అత్యవసర పరిస్థితులలో వచ్చే పేషెంట్లకు అవసరమైన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక్కడికి వచ్చే పెషెంట్లకు సర్గీయ నందమూరి తారక రామారావు ఆశించినట్లు పేద ప్రజలకు అందుబాటైన ధరలలో అత్యాధునికి వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతున్న ప్రయాణంలో ఈ వార్డు ఏర్పాటు భాగమని చెప్పారు. అంతే గాకుండా త్వరలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రేడియేషన్ యంత్రం తో పాటూ రెండవ పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని కూడా పేషెంట్లకు అందుబాటులోనికి తీసుకొని రానున్నట్లు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడుతున్న బాలకృష్ణ

హాస్పిటల్ కు వచ్చే రోగులకు స్వాంతన కలిగించడానికి హాస్పిటల్ ఎన్నో రకములైన సేవలు అందిస్తోందని తెలియజేస్తూ వాటికి గుర్తింపుగా సంస్థ ఎన్నో అవార్డులు అందుతున్నాయని తెలిపారు. అంతే గాకుండా నానాటికీ పెరుగుతున్న ఈ మహమ్మారి నివారణకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక పరిశోధనా విభాగం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో పాటూ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కలిగించడానికి కూడా సంస్థ ఎన్నో ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్దికి పాటుపడిన సిబ్బంది, యాజమాన్యంతో పాటూ నిధులు అందిస్తున్న పలువురు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతకు ముందుగా శ్రీ నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. వేడుకలలో భాగంగా సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక ప్రధర్శనలను వీక్షించారు.

ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI తో పాటు డా. గడ్డం దశరధరామి రెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాక రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాధ్, ఆసోసియేట్ డైరెక్టర్, యాడ్ లైప్ & అకడమిక్స్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *