యుజిసి నెట్ నోటిఫికేషన్ విడుదల

డిసెంబర్ 14 నుంచి 29 వరకు పరీక్షలు
దరఖాస్తులకు చివరతేదీ అక్టోబర్ 29
యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ – యూజీసీ – నెట్ (డిసెంబర్ 2026) పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 8 నుంచి 28 వరకు వరకు ఆన్ లైన్ (యుజిసి వెబ్ సైట్) లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల కోసం https://ugcnet.nta.nic.in/ugc-net-dec-2026-application-form-live/లో దరఖాస్తు అందుబాటులో ఉంది. ఈనెల 29 నుంచి 31 వరకు రూ 500 అపరాధ రుసుముతో దరఖాస్తులను అనుమతిస్తారు. డిసెంబర్ 14 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పీహెచ్ డీలలో ప్రవేశాలతో పాటు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)ల ప్రవేశాల కోసం ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరు నెలల్లో యుజిసి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యుజిసి-నెట్ కోసం ఏపీ, తెలంగాణలో పరీక్షా కేంద్రాలున్నాయి.
ఫీజు వివరాలు
అన్ రిజర్వ్ డ్ జనరల్ కేటగిరి అభ్యర్ధులకు రూ 1150, జనరల్ – ఈడబ్ల్యుఎస్, ఓబీసీ -ఎన్ సీఎల్ అభ్యర్ధులకు రూ 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ 325 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని యుజిసి ప్రకటించింది.
