gunturu

ప్రణదీప్ ‘ఫెన్సింగ్’..తగ్గేదేలే..!

 

పెన్సింగ్ క్రీడాకారుడు యన్ట్ర్రపల్లి ప్రణదీప్

ఫెన్సింగ్ లో రాణిస్తున్న గుంటూరు ఆణిముత్యం

అండర్ 12, 14 లో అనేక పతకాలు

గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్ష

ప్రణదీప్ .. ఫెన్సింగ్ క్రీడలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది..గుంటూరు నగరంలోని గోరంట్లకు చెందిన విద్యార్ధి యన్ట్రపల్లి ప్రణదీప్ ఫెన్సింగ్ లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ఆటకు వన్నె తీసుకు వస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అండర్ 12,14 పోటీల్లో పాల్గొని ఇప్పటికే పతకాలు సాధించిన ప్రణదీఫ్ జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించేందుకు మరిన్ని మెళుకువలు, నైపుణ్యాన్ని ప్రోది చేసుకునే దిశగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రణదీప్ ను గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అభినందించారు. ఫెన్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి గుంటూరు నగరానికి వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రణదీప్ తండ్రి యన్ట్రపల్లి శ్రీనివాసరావు, కోచ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రణదీఫ్ ను అభినందిస్తున్న గుంటూరునగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, పక్కన ప్రణదీప్ తండ్రి శ్రీనివాసరావు

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *