పెళ్ళిలో జగన్, కేటీఆర్, గౌతం అదానీ

  • చెన్నైలో వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ దంపతులు
  • తమిళనాడు సీఎం విజయ్, అదానీ, కేటీఆర్ తదితర ప్రముఖల హాజరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన వైయస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రేయ-ఉజ్వల్‌లను  వైయస్ జగన్ దంపతులు ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ కూతురు వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్, తమిళనాడు సీఎం విజయ్, గౌతం అదానీ

ఈ వివాహ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్ విజయమ్మతో పాటు పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *