లైంగిక సమానత్వంపై దళిత స్త్రీ శక్తి ప్రచారం ప్రారంభం

విజయవాడ: ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘16 రోజుల క్రియాశీల ప్రచార కార్యక్రమం’లో భాగంగా దళిత స్త్రీ శక్తి (DSS) ఆధ్వర్యంలో లింగ సమానత్వ ప్రచారాన్ని బుధవారం విజయవాడలో ప్రారంభించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత (ఐపీఎస్) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీసీపీ సరిత, జాన్సీ గెడ్డం కలిసి ప్రచార కార్యక్రమానికి జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దళిత స్త్రీ శక్తి సంస్థను అభినందించారు. లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ ప్రచారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మనోవైద్య నిపుణులు రామాదేవి, ప్రవీణ పాల్గొని ప్రసంగించారు. జాన్సీ గెడ్డం అధ్యక్షత వహించారు. సమన్వయకర్తలు జబాలి, ప్రసన్న, సౌజన్య, దేవి, అఖిల, ప్రవీణ్‌తో పాటు మహిళా సంఘాల నాయకులు చురుగ్గా పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమం అనంతరం విజయవాడలోని జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు రెండు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో లింగ సమానత్వ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 25న ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలకు లింగ సమానత్వం, మహిళల హక్కులు, గౌరవం, భద్రతపై అవగాహన కల్పించనున్నారు.
