పోలవరంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ పరీక్షలు

పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు రెండో రోజు బుధవారం పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలు గురువారం కూడా కొనసాగనున్నాయి. సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు హరీంద్ర ప్రకాశ్‌, శ్రీహరి టి. నాయర్‌, అమిత్‌ సేన్‌ జలవనరుల శాఖ ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈలు నిర్మల, శ్రీకాంత్‌, విజయ్‌, మల్లికార్జున, పటేల్‌ ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు.ఎంఈఐఎల్‌ పోలవరం ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ ఏ. గంగాధర్‌ కుమార్‌, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి తదితరులు పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయటంతో పాటు అవసరమైన సమాచారాన్ని అందచేయటంతో పాటు పరీక్షల్లో పాల్గొన్నారు. బుధవారం ప్రధానంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే గట్టిపడిన ప్రాంతంలో మట్టిని జేసీబీ తో తొలగించి దాని గట్టిదనంపై పరీక్షలు చేశారు. మంగళవారం సేకరించిన నమూనాలను మరోసారి పరీక్షించారు.
పోలవరం వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణులు
పోలవరం వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణులు
Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *