కొత్త కోనసీమలు..ప్రకాశం, రాయలసీమలు..
- వాటర్ మ్యాన్ చంద్రబాబుకే అది సాధ్యం
- వెలిగొండతో పశ్చిమ ప్రకాశంలో వెలుగులు
- రాయలసీమకూ అపరభగీరదుని బాబు సేవలు
- గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి
- 10 బస్సుల్లో 450 మంది పార్టీ కార్యకర్తలతో వెలిగొండ సందర్శన
ప్రకాశం, రాయలసీమలను కొనసీమలుగా మారుస్తున్న అపరభగీరధుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. తాను ప్రాతినధ్యం వహిస్తున్న గుంటూరు పశ్చిమ సెగ్మెంట్ లో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు‘ కార్యక్రమాన్నివిజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.వారందరినీ వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు తీసుకొచ్చినట్టు తెలిపారు.

చంద్రబాబు దూరదృష్టికి ప్రతీక వెలిగొండ
వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదు..అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే శ్లాఘించారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.మూడు దశాబ్దాల కల వెలిగొండ.. వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందన్నారు.
కార్యకర్తల సంతోషం
ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.

