ముదిగొండ శివప్రసాద్ మృతి

ముదిగొండ శివప్రసాద్

ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ (86) గురువారం రాత్రి మృతి చెందారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ లోకం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన 1940 డిసెంబర్ 23న అప్పటి ప్రకాశం జిల్లా ఆకుల అల్లూరులో జన్మించారు. ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దాదాపు వందకు పైగా పుస్తకాలు, అనేక చారిత్రక నవలలు రాసిన ముదిగొండ చరిత్రను కేవలం రాజులు, యుద్ధాల సమాహారంగా కాకుండా సజీవమైన కథలుగా మలిచారు. ఆయన రాసిన కొన్ని ప్రముఖ రచనలు సినిమాలు, డాక్యుమెంటరీలుగా కూడా రూపుదిద్దుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *