నేటి నుంచి ఆకాశదీపం ప్రారంభం

కార్తికమాసంలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఆకాశదీప ప్రారంభం ఒకటి. ఈ దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తికమాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఆకాశదీపాన్ని వెలిగించరు. కార్తికమాసం ప్రారంభం నుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడుసాయంతో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పరమశివునికి అంకితం చేస్తూ వెలిగించే పవిత్ర జ్యోతిగా భక్తులు భావిస్తారు. ఆకాశదీపాన్ని వెలిగించడం, దర్శించడం వల్ల పుణ్యఫలాలు లభించి, దైవానుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తికమాసమంతా ఆకాశదీపం వెలుగులు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను నింపుతూ భక్తులలో భక్తిభావాన్ని, శివనామ స్మరణను పెంపొందిస్తాయి

Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdeshఆధ్యాత్మికం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *