బాలకృష్ణ లక్ష్మీ పూజ
బసవతారకం క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో పూజలు చేసిన బాలయ్య
దీపావళి పండుగను పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ సాంప్రదాయపద్దతిలో పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అందరూ ఆరోగ్యంతో పాటూ అష్టైశ్వర్యాలతో వర్థిల్లితూ పురోగతిని సాధించే దిశగా సాగాలని ఆకాంక్షిచారు. సంస్థ మరింత పురోగతిని సాధించి ఎక్కువ మందికి సేవలు అందించేలా శక్తిని అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. సీవోవో రావి శ్రీనివాస రావు, మెడికల్ డైరెక్టర్, డా. టి సుబ్రహ్మణ్యేశ్వర రావు, జనరల్ మేనేజర్ గోపాలరావు, డాక్టర్లు చంద్రశేఖర్ రావు, వీరయ్య, బసంతకుమార్, సీ,కె నాయుడుతో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


