మాతా విద్యానందగిరి జీకి పదోన్నతి
త్వరలో మల్లవరంలో గోశక్తి పీఠం
మహా విద్యారణ్యగిరి సాధ్వీజీ వెల్లడి
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మాయాపూర్ లోని పంచాయతీ అఖాడా శ్రీ నిరంజనీ వారు ఒంగోలు , మల్లవరం భువనేశ్వరీ పరాశక్తి పీఠం పీఠాధీశ్వరి మాతా విద్యానందగిరి జీకి పదోన్నతి కల్పించారు. శ్రీ శ్రీ శ్రీ 1008 మహా మండలేశ్వర్ మహా విద్యారణ్యగిరి సాధ్వీజీ గా ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఆగస్టు 2027 గోదావరి కుంభమేళా సందర్భంగా సాధ్విజీ దివ్య పట్టాభిషిక్తులు అవుతున్న సందర్భంగా సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, కార్యదర్శి మేడికొండ శ్రీనివాస్ చౌదరి శుభాభినందనలు తెలిపారు. భువనేశ్వరీ పరాశక్తి అమ్మవారి అనుగ్రహంతో సాధ్వీజీ ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాధ్విజీ మాట్లాడుతూ త్వరలో మల్లవరంలో గోశక్తి పీఠం నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. గోమాతసమస్త సృష్టికి ఆత్మయని అన్నారు.

