రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగా..?..వెంటనే ఉపసంహరించాలి

ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్. అమర్ నాథ్ డిమాండ్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) తీవ్రంగా వ్యతిరేకించింది. నవంబర్ 16ను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాధనాన్ని, అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్. అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ప్రజా ఉద్యమ నాయకులు, సామాజిక సంస్కర్తలు, స్వాతంత్ర్య సమరయోధులు, కార్మిక, రైతాంగ పోరాటాల త్యాగధనులు, కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారని వెల్లడించారు. సమాజ మార్పు కోసం జీవితాలను అంకితం చేసిన వారి సేవలను గుర్తించకుండా, ఒక సంపన్న పారిశ్రామికవేత్త వ్యక్తిగత కీర్తికి ప్రాధాన్యత ఇవ్వడం పాలకుల వర్గ దృక్పథాన్ని తెలియజేస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనుచిత ఖర్చులకు పూనుకోవడం ప్రజా వ్యతిరేకం..రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *